ఆసలు హీరో నాగ శౌర్య ప్రాబ్లెమ్ ఏంటి..!!

-

యంగ్ హీరో శౌర్య అకస్మాత్తుగా అనారోగ్యం తో హాస్పిటల్ లో జాయిన్ కావడం టాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఒక పక్క సూపర్ స్టార్ కృష్ణ హాస్పిటల్ జాయిన్ కావడం అదే సమయంలో శౌర్య కూడా హాస్పిటల్ కు తరలించడం తో పరిశ్రమ లో అలజడి మొదలయ్యింది.

ఒక పక్క సినిమా యూనిట్ వర్గాలు సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిందని కంగారు పడుతున్నారు. ఈ సంఘటన తో సినిమా బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంకా నాగ శౌర్య కు  ట్రీట్మెంట్ జరుగుతుందని తెలుస్తోంది. సరిగ్గా తినకుండా మరియు సరైన నిద్ర కూడా లేకుండా షూటింగ్ లో పాల్గొనడం వల్ల బాగా నీరసం అయి, ఇదంతా జరిగిందని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది.

నిన్నటి నుంచి శౌర్య ఇంకా హాస్పిటల్ లోనే ఉన్న కూడా, ఇంకా శౌర్యను డిశ్చార్జ్ చేయలేదు. దీనితో వారి కుటుంబ సభ్యులు, బందువులు దిగులు చెందుతున్నారు. ఎందుకంటే మరి కొన్ని రోజులలో తన పెళ్లి పెట్టుకున్నారు. శుభమా అని పెళ్లి పెట్టుకుంటే ఇలా అయిందని వారు బాధపడుతున్నారట. ఇక రేపో మాపో హీరోను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయినా కూడా కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పే ఛాన్స్ ఉందని బంధువులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news