దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎవరికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ చిత్రం చాలా రోజుల తర్వాత ఒక బిగ్ బడ్జెట్ మూవీ థియేటర్ లలో 50 రోజుల పాటు కొనసాగడం గమనార్హం. ముఖ్యంగా 50 రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్లు అందించింది.. నిర్మాతలకు ఎంత లాభం వచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకొందాం.
ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యధిక లాభాలు సొంతం చేసుకున్న ఈ సినిమా దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 50 రోజులకు గాను బాక్సాఫీస్ షేర్ ను అందుకుంది ఈ సినిమా. నైజాంలో రూ.111.7 9 కోట్లు.. సీడెడ్ రూ.51.40 కోట్లు.. ఉత్తరాంధ్ర రూ.35.10 కోట్లు.. వెస్ట్ రూ.13.39 కోట్లు , తూర్పు రూ.16.35 కోట్లు.. గుంటూరు రూ.18.19 కోట్లు.. కృష్ణ రూ.14.69 కోట్లు.. నెల్లూరు రూ.9.40 కోట్లు. ఇక ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మొత్తం 50 రోజులకు గాను రూ.269.81 కోట్ల షేర్ రాగా రూ.410 .35 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.
ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 50 రోజులలో రూ.608.67 కోట్ల షేర్ వచ్చింది. ఇక రూ.1134.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు సమాచారం. 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాతలకు మొత్తంగా రూ.156 కోట్లకు పైగా ప్రాఫిట్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.