మిస్టరీ గా మారిన మారుతీరావు మరణం…. అసలు కారణం ఏంటి!!

-

మారుతీ రావు ఎలా చనిపోయాడు అనేది మిస్టరీగా మారింది. పోలీసులకు ఇది సూసైడా…లేక హత్యనా అనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో అనుమానాస్పద మృతిగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు లోతుగా చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడం అసలు ప్రశ్నలకు తావిస్తోంది. అటు మారుతీరావు గదిలో ఎలాంటి పురుగుల మందు డబ్బా దొరకకపోవడం గమనార్హం. కానీ దానికి సంబంధించిన ఆనవాళ్లు కానీ కనిపించలేదు. సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఏం జరిగింది అనేది అన్నదానిపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు. సరిగ్గా ఆరు గంటల యాభై నిమిషాలకు ఆర్య వైశ్య భవన్‌కు మారుతీరావు వచ్చాడు. తర్వాత డ్రైవర్‌ను కిందికి పంపి గారెలు తెప్పించుకుని తిన్నాడు. అయితే వెంటనే వాంతులు అయినట్టు ఆధారాలు ఉన్నాయి. అలాగే గది నుంచి ఒకసారి బయటకు వచ్చిన మారుతీరావు ఎవర్ని కలిశాడన్నది ఆరా తీస్తున్నారు పోలీసులు. అటు మారుతీరావు మిర్యాలగూడలోని మిత్రుడి షాపులో మందులను కొనుగోలు చేసినట్లు సమాచారం ఉంది. అయితే పురుగుల మందు కొనుగోలు చేసినట్లు గా ఎలాంటి ఆధారాలు లేకపోవడం తో అసలు ఏమి జరిగింది అన్న విషయం పెద్ద సస్పెన్స్ గా మారింది. కేవలం పోలీసుల ఒత్తిడి కారణంగా మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డారా,లేదా కుటుంబ లో తమ్ముడి తో వచ్చిన విభేదాల కారణంగా ఆత్మహత్య కు పాల్పడ్డారా అన్న విషయం మాత్రం అర్ధం కావడం లేదు. అసలు ఆయన మృతి పై ఇంకా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తక్కువ కులం వ్యక్తిని కూతురు అమృత ప్రేమించి పెళ్లి చేసుకుంది అన్న కక్ష తో ఏకంగా కిరాయి హంతకుల చేత అల్లుడు ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. 2018 సెప్టెంబర్ 14 చోటుచేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం గా మారింది. అయితే కూతురు అమృత ఫిర్యాదు తో మారుతీరావు ను అరెస్ట్ చేయగా చాలా ఓపెన్ గా అవును నేనే చంపించాను అని కూడా ఒప్పుకున్నాడు. అయితే అలాంటి వ్యక్తి ఇలా ఆత్మహత్య కు పాల్పడతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి మారుతీరావు మరణం వెనుక అసలు కారణం ఏంటి అనేది మాత్రం వెల్లడికావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version