పుష్ప 2 తర్వాత రష్మిక పయనం ఎటువైపు..?

-

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమా ద్వారా పరిచయమై గీతాగోవిందం సినిమాతో సక్సెస్ సాధించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మొదటి రెండు సినిమాలతోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే 2021 డిసెంబర్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమెకు ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది..

గతంలో కమిట్ అయిన పుష్ప 2 సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. బాలీవుడ్ లో కమిట్ అయిన రెండు మూడు సినిమాలలో కూడా ఇప్పటికే కొన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాయి. మరికొన్ని సినిమాల పరిస్థితి ఏంటి అన్న విషయం మరింత ఆసక్తికరంగా మారింది.. ప్రస్తుతం తెలుగులో ఈమె నటిస్తున్న పుష్ప 2 సినిమా సక్సెస్ అయ్యి.. ఆ సినిమాలో ఈమె పాత్రకు మంచి టాక్ దక్కితే తప్ప ఈమె కెరియర్ లో ముందడుగు వేసే పరిస్థితి లేదు అంటూ బాక్స్ ఆఫీస్ వర్గాల వారు అలాగే సినీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈమె క్రేజ్ కూడా తగ్గుతున్న నేపథ్యంలో ఆఫర్లు కూడా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలోనే వెంటనే రష్మిక బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆఫర్స్ తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని సమాచారం ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే పుష్ప 2 సినిమా తరువాత రష్మిక పయనం ఎటువైపు అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version