శ్యామ్ సింగరాయ్ పోస్టర్: నానిని కౌగిలించుకున్న హీరోయిన్ ఎవరంటే..?

-

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజుని పురస్కరించుకుని శ్యామ్ సింగరాయ్ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అమాంతం జనాల్లోకి దూసుకువెళ్ళింది. తన కెరీర్లో ఎన్నడూ చేయనటువంటి సరికొత్త గెటప్ లో నాని కనిపించాడు. కథాంశం కలకత్తాలో జరుగుతున్నదని ముందే చెప్పారు కాబట్టి, దానికి తగ్గట్టుగానే ప్రింటింగ్ మెషిన్, రిక్షా కనిపించాయి. అవన్నీ పోస్టర్ కి సరికొత్త అందన్ని తీసుకురావడమే కాకుండా పీరియాడిక్ డ్రామా అని చెప్పాయి.

ఐతే అంతా బాగానే ఉంది కానీ, పోస్టర్ లో నానిని హత్తుకున్నది ఎవరో మాత్రం తెలియలేదు. చేతులకి గోరింటాకు, చున్నీ, పెద్ద గాజులని చూస్తుంటే బెంగాళీ అమ్మాయిలా కనిపిస్తుంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సో, సాంప్రదాయ పద్దతిలో కనిపిస్తున్న ఈ అమ్మాయి సాయి పల్లవి అయ్యుంటుందని అనుకుంటున్నారు. సినిమాలో తన పాత్ర కీలకంగా ఉంటుందని అందుకే ఫస్ట్ లుక్ లో తనని చూపించి చూపించనట్టుగా చూపించారని అంటున్నారు. రాహుల్ సాంకృత్యాయాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version