నాగచైతన్య ను ఆ బడా ఫ్యామిలీకి అల్లుడు కాకుండా చేసిందేవరు..!!

-

అక్కినేని నాగచైతన్య.. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య ఎప్పటికప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఇకపోతే తాను ప్రేమించి, వివాహం చేసుకున్న సమంతకు దూరం కావడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య కారణాలు తెలియకనే విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది . ప్రస్తుతం ఎవరిదారి వారు చూసుకోవడమే కాదు ఎవరు సినిమాలలో వారు బిజీ అయిపోయారు. విడాకులు ప్రకటించి దాదాపు పది నెలలు అవుతున్నప్పటికీ ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఎన్నో సంవత్సరాల ప్రేమకు అలాగే నాలుగు సంవత్సరాలు వైవాహిక బంధానికి ముగింపు చెబుతూ విడాకులు తీసుకోవడం చాలా బాధాకరమని చెప్పవచ్చు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకోక పోయి ఉంటే ఎవరిని పెళ్లి చేసుకునేవాడు? అంటూ ఒక ప్రశ్న సినీ అభిమానులను తెగ కలవరపెడుతోంది.. అయితే నాగచైతన్య కుటుంబం వేరే ఏ ఫ్యామిలీతో కూడా సంబంధం కలుపుకోవాలని చూడలేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక పోతే ముందుగా నాగచైతన్య , సమంతను ప్రేమిస్తున్నట్లు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అందుకే నాగచైతన్య ఫ్యామిలీ – నందమూరి ఫ్యామిలీతో సంబంధం కలుపుకోవాలని అనుకుందట. ఇక ఈ విషయాన్ని ఒక సందర్భంలో స్వయంగా అక్కినేని నాగార్జున వెల్లడించారు.టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళలాంటి వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ అలాగే ఏఎన్ఆర్. ఇద్దరూ కూడా ముందు నుంచి మంచి మిత్రులే. ఇక వీరి కుటుంబం కూడా చాలా సన్నిహితంగా ఉండేది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగినా.. మరొకరు కచ్చితంగా హాజరయ్యేవారు.. అంతలా ఉన్న వీరి స్నేహాన్ని బాలకృష్ణ , నాగార్జున బంధంగా మార్చుకోవాలని అనుకున్నారు. ఇంకా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నీ నాగచైతన్య కి ఇచ్చి పెళ్లి చేయాలని అప్పట్లో ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి . కానీ నాగచైతన్య అప్పుడే సమంతతో తన ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. లేకపోతే బాలకృష్ణ ఇంటికి అల్లుడుగా వెళ్లేవాడు నాగచైతన్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version