ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలక పోవడానికి నీటి ఊటనే కారణమని పేర్కొన్నారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
నీటిని బయటికి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేది. నేను విద్యుత్ శాఖా మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్ళారా చూసా.. టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పాం. నాడు సమైక్యాంద్ర పాలకుల కుట్రల కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. టన్నెల్ వద్ద మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.ప్రాజెక్టు పై అవగాహన లేక పరువు తీసుకుంటున్నారు. ఓ మంత్రి వాటర్‌లో నీళ్ళు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి కమెడియన్ అయ్యాడు. గోడకు చెవులు పెట్టడం…సొరంగ మార్గంలో ఫోన్ రింగ్ అవుతుందని చెబుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు’ అని వెల్లడించారు.