భార్య వేధింపులు : ఆన్లైన్ లో పురుగుల మందు ఆర్డర్ చేసుకుని భర్త ఆత్మహత్య

-

హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధి లో దారుణం చోటు చేసుకుంది. భార్య వేధింపులు తట్టు కోలేక సంతోష్ అనే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకొని కూల్ డ్రింక్ లో పురుగులు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు సంతోష్. అయితే.. ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సంతోష్ ను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.

అయితే..కాసేపటి క్రితమే చికిత్స పొందుతూ మృతి చెందాడు సంతోష్. 2013 లో పాత బస్తీ కి చెందిన కళ్యాణ్ ని అనే మహిళ తో వివాహం చేసుకున్నాడు సంతోష్.. కొడుకు అభిరామ్ కు గత కొంత కాలంగా అనారోగ్య సమస్య తో భాద పడుతున్నట్లు సమాచారం అందుతోంది. అప్పటి నుండి భర్త సంతోష్ ను వేధింపులు గురిచేసినట్లు కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు.

ఆన్ లైన్ లో పురుగులు మందు ఆర్డర్ చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు బ్యాంక్ ఉద్యోగి సంతోష్. ఇప్పటికే మూడు దఫాలు తనపై హత్యాయత్నం చేశారని, కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారని సెల్ఫీ వీడియో లో తెలిపారు సంతోష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version