జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. దీంతో మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేసి కౌన్సిల్ నుంచి బయటకు పంపించి వేయగా.. బయట కూడా గులాబీ కార్పొరేటర్లు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా, మహిళా కార్పొరేటర్ల అరెస్టును మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఖండించారు.అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిధులు ఇవ్వాలని అడిగితే అక్రమ అరెస్ట్ చేసారంటూ ఖండించిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు… https://t.co/usnnNUrjR1 pic.twitter.com/oZA0KZXAuH
— Telugu Scribe (@TeluguScribe) January 30, 2025