‘నీ రన్నింగ్ కామెంటరీ ఆపుతావా’.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ‌పై మండలి చైర్మన్ సీరియస్

-

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో శాసన మండలిలోనూ సభ్యుల మధ్య వాడీవేడిగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. శనివారం మండలిలో ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతుండగా.. తాత మధు రన్నింగ్ కామెంటరీ చేయడంపై చైర్మన్ ఫైర్ అయ్యారు.

‘ఏందయ్య నీ లొల్లి..న్యూసెన్స్ చేస్తున్నావ్..ప్రతీరోజు మీ రన్నింగ్‌ కామెంటరీ ఏంటని’ తాత మధును ప్రశ్నించారు.ఏదైనా మాట్లాడాలనుకుంటే మైక్‌ ఇచ్చినప్పుడు మాట్లాడాలని గుత్తా సుఖేందర్‌‌రెడ్డి సూచించారు.దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. మండలి సభ్యులను ఉద్దేశించి సభలో గౌరవ చైర్మన్ న్యూసెన్స్ అనే పదం వాడటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.ఆ పదం వాడటం కరెక్ట్ కాదన్నారు.ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version