ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే.. మోడీని కలిసే ఛాన్స్‌!

-

సరికొత్త నమో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అద్భుత అవకాశం లభించనుంది. దీన్ని దాదాపు ఐదు వేలకు పైగా కార్యకర్తలతో ఈ యాప్‌ను ప్రారంభించింది.
ఇప్పటికే ఈ యాప్‌ను బీజేపీ, మోడీ అభిమానులు ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేందుకు పార్టీ నిర్ణయించింది.

Narendra Modi App

నమో యాప్‌ను 1,100 మంది ప్రజలతో డౌన్‌లోడ్‌ చే యిస్తే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఈ యాప్‌ను 5,100 మందితో డౌన్‌లోడ్‌ చేయిస్తే ప్రధాని మోడీని కలిసే లక్కీ ఛాన్స్‌ లభిస్తుందని పార్టీ అధికారిక ప్రతినిధులు తెలిపారు. నమో యాప్‌ను ప్రచారం చేసేందుకు జూలై నుంచే మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయటమే ముఖ్య లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే!

నమో యాప్‌ ప్రచార కార్యక్రమానికి ఇ¯Œ ఛార్జ్‌గా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి హర్షదీప్‌ మల్హోత్రా వ్యవహరిస్తున్నారు. యాప్‌ యూజర్ల సంఖ్యను పెంచేందుకు బూత్‌ స్థాయిలోని పార్టీ ప్రముఖులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. నమో యాప్‌ను నియోజకవర్గాల్లో కూడా అవగాహన కల్పించేందుకు ఈ విధంగా ఆలో చన చేశారు.
విస్తృత స్థాయిలో బీజేపీ, మోడీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించేందుకు ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version