ఈ మూడు ఆహారాలతో బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయట..!

-

ఈ రోజుల్లో డయబెటీస్ తో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. 40 ఏళ్ల దాటిన ప్రతీ పదిమందిలో ఆరుగురికి మధమేహం వస్తుంది. ఇక జీవితాంత వారు ఏ వ్యాధితో పోరాడాల్సిందే.. తినకూడినవి తిన్నా తప్పే.. తినాల్సినవి తినకున్నా తప్పే.. ఇష్టమైనవి తినలేరు.. కష్టమైనవి మానలేరు. స్వీట్ కు దూరం మవ్వాలి.. చెక్కరవ్యాధితో జీవితంలో చెక్కర దగ్గరకు రానియ్యకూడదు. 40ఏళ్లు మహిళలకు చెక్కరతతో పాటు అనేక దీర్ఘరోగాలు వస్తున్నాయి..అందుకే ముందు నుంచే.. ఆరోగ్యంపై మహిళలకు ప్రత్యేక శ్రద్ద పెట్టాలంటున్నారు నిపుణులు. ఈరోజు మనం షుగర్ , బీపీ కంట్రోల్లో ఉండటానికి మెయిన్ గా తీసుకోవాల్సిన మూడు ప్రధాన ఆహారాల గురించి చూద్దాం.

 నేరేడు పండ్లు

వేసవిలో నేరేడు పండ్లు తినడం వల్ల అధిక బీపీ, మధుమేహం అదుపులో ఉంటాయి. ఎప్పటినుంచో.. మధుమేహానికి నేరేడు పండ్లు మంచి విరుగుడుగా మన పెద్దోళ్లు చెప్తున్నారు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం అధిక బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పిల్లల నుంచి వృద్ధాప్యం వరకు రోజూ సరైన మోతాదులో తినగలిగే పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి.

బీట్‌రూట్

బీట్‌రూట్‌ శరీరంలో రక్తం కొరతని తీర్చి మనల్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది. అంతేకాదు బీట్‌రూట్ మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. చాలామంది డయబెటీస్ వస్తే.. దుంపలకు దూరంగా ఉండాలి అనుకుంటారు. ఈ క్రమంలోనే అన్ని దుంపలను తినడం మానేస్తారు. నిజానికి ఒక్క బంగాళదుంపనే దూరంగా పెట్టి మిగతావి తీసుకోవచ్చు. డైలీ బీట్ రూట్ తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇందులో ఫోలేట్ ఉంటుంది ఇది రక్తనాళాలని దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందులో ఉండే చక్కెర సహజమైన గ్లూకోజ్‌గా మారుతుంది. ఈ కారణంగా డయాబెటిక్ రోగులకు ఇది చాలా మంచిదనే చెప్పాలి. డయబెటీస్ రోగులు చిలకడదుంప, బీట్ రూట్, క్యారెట్ లాంటివి ముక్కలగా చేసుకుని డైలీ తినొచ్చు. అయితే వీటితో జ్యూస్ మాత్రం తాగకూడదు.

వెల్లుల్లి

అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిని సైతం వెల్లుల్లి నియంత్రిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మూలకం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ప్యాంక్రియాస్‌ను ప్రేరేపిస్తుంది. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది. వెల్లుల్లిని అనేక విధాలుగా వాడుకోవచ్చు కానీ కాల్చిన వెల్లుల్లి మరింత ప్రయోజనకరంగా ఉంటుందట.
ఆరోగ్య నిపుణుల సలహా మేరకే ఈ సమాచారం అందించడం జరిగిందని గమనించగలరు.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version