కంగనాను కొట్టిన మహిళకు ఉద్యోగం ఇస్తా: విశాల్ దర్లానీ

-

ఎంపీ కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న CISF కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్రానీ అండగా నిలిచారు. ‘నేను హింసకు మద్దతు ఇవ్వను. కానీ ఆమె కోపాన్ని అర్థం చేసుకున్నా అని అన్నారు. కుల్వీందర్పై CISF చర్యలు తీసుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. జై హింద్. జై జవాన్. జై కిసాన్’ అని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

కాగా, నటి, బీజేపీ నేత కంగనా రనౌత్ను చెంపదెబ్బ కొట్టడానికి గల కారణాన్ని CISF మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెబుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ‘రైతులు రూ.100 కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు. ఆమె అలా వెళ్తుందా? ఆ నిరసనకారుల్లో నా తల్లి కూడా ఉన్నారు’ అని తెలిపారు. కాగా కౌర్ను సస్పెండ్ చేసిన CISF చండీగఢ్ లోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేసింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version