రేపు వైసీపీ ‘గడప గడపకు’ కార్యక్రమంపై వర్క్‌షాప్‌

-

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించేందుకు చేపట్టిన గడప గడరపు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. అయితే గత నెల 11వ తేదీన ప్రారంభమైన కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌లకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు వస్తున్న స్పందన.. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం తదితరాలను సమీక్షించి.. మరింత సమర్థవంతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌.

ఇందులో భాగంగా బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు సీఎం జగన్‌. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే ఎన్నికల్లో ఇచ్చిన 95 శాతం హామీలను అమలు చేశారు సీఎం జగన్‌. అర్హతే ప్రమాణికంగా అందరికీ సంక్షేమ ఫలాలను సీఎం జగన్‌ అందిస్తున్నారు. మూడేళ్లలోనే సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.43 లక్షల కోట్లను జమ చేశారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను ఆధునికీకరించి.. నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. గత సర్కార్‌ పాపం వల్ల శిథిలమైన రహదారులను బాగు చేస్తున్నారు. జిల్లాకో వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version