జిమ్ లో పూజని చూస్తుంటే, ఓరి బాబోయ్ ఇలా ఉందేంటి…!

-

పూజ హెగ్డే’ ఇప్పుడు టాలివుడ్ లో స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ ఈ అమ్మాయి. వరుసగా సినిమాలు చేస్తూ హిట్ లు కొట్టేస్తుంది ఈ భామ. దీనితో టాలివుడ్ స్టార్ దర్శకుల కళ్ళు అన్ని ఇప్పుడు పూజ వైపే చూస్తున్నాయి. నందమూరి, మెగా ఫ్యామిలీలు ఇద్దరికీ హిట్ లు ఇచ్చేసింది ఈ భామ. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో నటించింది.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ నటించింది. అలాగే మహేష్ బాబు సరసన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఎన్టీఆర్ సరసన అరవింద సమేత సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు మంచి హిట్ లు ఇచ్చాయి పూజకి. ఇక ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది.

తన సినిమా ప్రకటనలు, తన వ్యక్తిగత జీవితం ఇలా అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. జిమ్ లో పూజ వర్కౌట్ చేస్తున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూజ హాట్ గా ఉందని కొందరు అంటే, మరి కొందరు ఇంత హాట్ గా జిమ్ లో వర్కౌట్ చేస్తే జిమ్ మాస్టర్ మీతో జిమ్ చేయించలేరని కామెంట్ చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version