మనకు చిన్న జ్వరం వచ్చిన డాక్టర్ దగ్గరకు పరుగులు తీస్తాము. ఈ ఒక్క మాటతో ఈ ప్రపంచంలో డాక్టర్ అవసరం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ముఖ్యమైన డాక్టర్స్ ను గుర్తుంచుకుని వారి సేవకు సంవత్సరంలో ఒక రోజును కేటాయించారు. ప్రతి సంవత్సరం మార్చ్ 30వ తేదీన వరల్డ్ డాక్టర్స్ డే. గత మూడు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని పట్టి పీడించిన మహమ్మారి కరోనా కారణంగా లక్షల మంది మరణించిన విషయం తెలిసిందే.
ఈ డాక్టర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు చికిత్సను అందించకుండా ఉంటే ఇంకా లక్షల్లో మరణించేవారు. అందుకే ప్రాణాలను దానం చేసే డాక్టర్స్ ను జీవితాంతం గుర్తుంచుకుని గౌరవించాలి. మీకు దగ్గర ఉన్న మీకు తెలిసిన ప్రతి ఒక్క డాక్టర్ ని ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలపండి. “బిగ్ థాంక్స్ టు ఆల్ ది డాక్టర్స్ ఇన్ ది వరల్డ్”