కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఈ మహమ్మారి దెబ్బకి ప్రభుత్వాలకి, ప్రజలకి కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. ఇకపోతే తాజాగా.. ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,88,824 లక్షల కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 2,67,72,196కి చేరింది.
కరోనాతో 5,545 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 8,78,065కి పెరిగింది. రికవరీ కేసులు 1.88 కోట్లు ఉండగా, యాక్టివ్ కేసులు 70.14 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది.