ప్రపంచం మొత్తం దేవుడి వైపు చూస్తూ… కోరుకునేది ఒక్కటే… కరోనా మహమ్మారి మమ్మల్ని ఎప్పుడు వదిలేస్తుంది అని… అవును ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా దీని బారి నుంచి బయటపడటానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. కరోనా మమ్మల్ని ఎప్పుడు వదిలేస్తుంది రా బాబూ అంటూ చాలా దేశాల అధినేతలు మనసులో బాధ పడిపోతున్నారు అనేది వాస్తవం. అయితే చైనా పరిశోధకులు మాత్రం సంచలన విషయం చెప్పారు.
కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలే అవకాశం లేదని, చలికాలం రాగానే మరోసారి ప్రపంచాన్ని ఇది వణికించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. షాంఘైలో కొవిడ్-19 నిపుణుల బృందానికి నేతృత్వం వహిస్తున్న జాంగ్ వెన్‌హాంగ్ సంచలన విషయాలు చెప్పారు. వచ్చే చలికాలంలో చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా రెండోసారి కరోనా రావచ్చని, అయితే మనకు నాలుగు నెలల సమయం ముందు ఉందని చెప్పిన ఆయన…
ఈ నాలుగు నెలల్లో దీనిని కట్టడి చేస్తే మనకు కాస్త అప్పుడు కట్టడి చేయడానికి సమయం దొరుకుతుందని ఆయన సూచించారు. చైనా ఇప్పటికే కరోనాను నియంత్రించడంలో మంచి అనుభవం సాధించినందువల్ల ఈసారి కఠినమైన నిబంధనలు విధించాల్సిన అవసరం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాబోయే రెండేళ్ళు ప్రపంచానికి అత్యంత కీలకమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.