పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండించ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. పోసాని కృష్ణమురళి ని అక్రమంగా అరెస్టు చేశారన్న జగన్.. టీడీపీ సర్కార్ పై ఆగ్రహించారు. పోసాని సతీమణి కుసుమలతను ఫోన్‌లో పరామర్శించారు వైఎస్ జగన్.. అండగా ఉంటామని ధైర్యం చెప్పిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.

ఇది ఇలా ఉండగా పోసాని కృష్ణమురళిని నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో ఉన్న పోసాని కృష్ణ మురళిని… ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. శివరాత్రి పండుగ అని చూడకుండా… దౌర్జన్యంగా పోసాని కృష్ణ మురళిని ఏపీకి తరలించారు పోలీసులు. ఈ తరుణంలోనే ఇవాళ.. అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లెకు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని తరలించారు. నిన్న రాత్రి గచ్చిబౌలిలో పోసానిని అరెస్టు చేసి నేరుగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తరలించడం జరిగింది.