ఏపీ వైసీపీ ఎమ్మెల్యే కొడుక్కి రెండో సారి పాజిటివ్ !

-

కరోనా సోకి తగ్గిపోయిన వారికి మళ్ళీ కరోన సోకుతున్న కేసులు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి దాకా అవి చాలా తక్కువ సంఖ్యలోనే నమోదయినా టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా ఏపీలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ కి రెండవసారి కరోనా పాజిటివ్ అని తేలింది.

ముందు ఆగస్టు 23న అభినయ్ కి మొదటి సారి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పుడు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో అభినయ్ చికిత్స పొందాడు. అయితే కరోనా తగ్గి పోవడంతో అయన తిరుపతికి వచ్చేశారు. అయితే తాజాగా ఆయనకు మరో మారు లక్షణాలు కనిపించడంతో ఆయన ఈసారి తన తండ్రి కరుణాకర్ రెడ్డి కరోనా తో చికిత్స పొందిన తిరుపతి రుయా ఆసుపత్రిలోనే చికిత్స కోసం అడ్మిట్ అయినట్టు తెలుస్తోంది. సో జాగ్రత్త ఒకసారి కరోనా సోకి తగ్గినా మళ్ళీ కరోనా సోకుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version