మీ చేతివేళ్ళ గోర్లు మీ అనారోగ్యాన్ని చెప్పేస్తాయని మీకు తెలుసా..? ఇది చదవండి

-

మీ చేతి వేళ్ళ గోర్లను బట్టి మీ అనారోగ్యాన్ని అంచనా వేయవచ్చు. ఎస్.. చేతివేళ్ల గోర్లు మామూలుగా కాకుండా వాటిలో ఏవైనా తేడాలు కనిపించినట్లయితే శరీరంలో మార్పులు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చేతివేళ్ల గోర్లను బట్టి.. శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

పలుచని గోర్లు:

గోర్లు పలుచగా ఉండటంవల్ల చాలా తొందరగా విరిగిపోతుంటాయి. ఇలా పలుచనైన గోర్లు విరిగిపోతుంటే శరీరంలో విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే క్యాల్షియం, ఐరన్ వంటి లోపాలు ఉన్నాయని అంచనాకి రావచ్చు.

గోర్ల మీద తెల్ల మచ్చలు:

కొన్ని ఎలర్జీల కారణంగా, శరీరంలో జింక్ కనీసం లోపించడం కారణంగా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా గోర్ల మీద తెల్ల మచ్చలు వస్తాయి.

పసుపు రంగులో గోర్లు:

సిగరెట్లు ఎక్కువగా తాగే వాళ్లలో సాధారణంగా గోర్లు పసుపు రంగులో కనిపిస్తాయి. అంతేకాదు, దీనికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు. అలాగే శ్వాసకోశ సంబంధ వ్యాధులు, థైరాయిడ్ కూడా గోర్లు పసుపు రంగులోకి మారడానికి కారణం అవుతాయి.

శంఖు ఆకారంలో గోర్లు:

గోర్లు నార్మల్ గా కాకుండా శంఖు ఆకారంలో శరీరంలో ఏవో మార్పులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. బాడీలో రక్తం తగ్గిపోవడం, లివర్ ప్రాబ్లమ్స్ వంటి వాటి వల్ల కూడా గోర్లు శంఖు ఆకారంలో పెరుగుతాయి.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news