జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి అమరావతి అనే బ్రాండ్ నేమ్ కనిపించకుండా చేయాలని అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ ని జగన్ తెరపైకి తీసుకువచ్చాడు. ఆ టైంలో చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కొన్ని కొన్ని నగరాల పేర్లను రాజధానిగా చేస్తారు డిస్కషన్స్ పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా దీనికి సంబంధించి జీవో కూడా విడుదల అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో విజయవాడ మరియు విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటు చేసే క్రమంలో చంద్రబాబు పెట్టిన అమరావతి పేరును తాజాగా జగన్ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చడంతో రాజధాని రైతులు.. కరోనా వైరస్ రాకపోతే ఈపాటికి అమరావతి తరలి పోయేదని ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు చూస్తుంటే భవిష్యత్తులో అమరావతి పేరు వినిపించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది.