టీఎస్ పీఎస్సీ కేసీఆర్, కేటీఆర్ జేబు సంస్థ : షర్మిల

-

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్, ఆయన కొడుకు మంత్రి కేటీఆర్‌కు కొలువులు అమ్ముకోవడమే టార్గెట్ పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. అందుకే టీఎస్ పీఎస్పీ ప్రశ్న పత్రాల లీకేజీ కేసును సిట్‌కు అప్పగించారని షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. టీఎస్ పీఎస్సీ కేసీఆర్, కేటీఆర్ జేబు సంస్థ అని దీని ద్వారా మరోసారి తేలిపోయిందన్నారు. అయినవాళ్లకు పదవులు కట్టబెట్టి, కొలువులు అమ్ముకోవడమే తండ్రీకొడుకుల టార్గెట్ అని మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ అంటే చట్టబద్ధ సంస్థ అని చెప్పే చిన్నదొర చట్టానికి విరుద్ధంగా పదవులు ఎందుకు కట్టబెట్టినట్టని ప్రశ్నించారు. నిరుద్యోగుల ప్రాణాలు పోతున్నా, అర్హత, సామర్థ్యం లేని వ్యక్తులను సభ్యులుగా ఎందుకు నియమించినట్టని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.

సిట్ రెండు నెలలుగా దర్యాప్తు పేరుతో ఊగిసలాడుతోందని మండిపడ్డారు. సభ్యుల నియామకం అక్రమమని హైకోర్టు చెప్పే దాకా ఎందుకు తేల్చలేదకపోయారని ఆమె ప్రశ్నించారు. దొంగలకే తాళాలు ఇచ్చినట్టు మళ్లీ కొలువులు అమ్ముకోవడమే కేసీఆర్, కేటీఆర్ లక్ష్యమన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు కోరకుండా సిట్‌తో అంతా సెట్ చేస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను, కేటీఆర్‌ను విచారణ చేస్తేనే అసలు నిజాలు బయటపడతాయని ఆమె పేర్కొన్నారు. ప్రశ్న పత్రాల కుంభకోణంలో ఇప్పటి వరకు అసలు దొంగలను పట్టుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ యువతకు క్షమాపణ చెప్పి బిశ్వాల్ కమిటీ సూచించిన ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీచేయాలని షర్మిల డిమాండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version