“ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్”.. మంత్రి హరీష్‌పై షర్మిల సెటైర్లు

-

“ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్” అన్నట్లుంది అరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ అంటూ సెటైర్లు వేశారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. తాజాగా ఆమె మాట్లాడుతూ.. అబద్ధాలు అతికినట్లు చెప్పినా.. అవి నిజాలు అయిపోవు మంత్రి గారు..! పరికరాలు సమకూర్చినం, భవనాలు కట్టినం అని గొప్పలు చెప్తే సరిపోతుందా..? PHC నుంచి జిల్లా ఆసుపత్రి వరకు వస్తున్న రోగుల సంఖ్య ఎంత..? వారికి వైద్యం అందిస్తున్న సిబ్బంది ఎంత..? వైద్యం అందక రోగుల ఆర్తనాదాలు మీకు వినిపించవు. సర్కారీ దవాఖానలో వైద్యం అందక చచ్చే చావులు కనిపించవు. మెటర్నిటీ మరణాలను ఆపలేని మీ ప్రభుత్వం.. మెరుగైన వైద్యంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పడం సిగ్గు అనిపించడం లేదా..? ఆసుపత్రుల్లో నర్సులు ఉంటే డాక్టర్ ఉండడు.

డాక్టర్ ఉంటే ఇతర సిబ్బంది ఉండరు. X – ray, సిటీ స్కాన్, టిఫా స్కాన్ లాంటి యంత్రాలకు టెక్నీషియన్ లు లేక ఎన్నో ఆసుపత్రుల్లో మూలకు పడ్డాయి. జిల్లా ఆసుపత్రిలో 300 మంది సిబ్బంది ఉండాల్సిన చోట 30 మందితో వైద్యం అందించడం అభివృద్ధి అంటరా..? మహానేత హయాంలో అద్భుతంగా అమలయిన అరోగ్యశ్రీ పథకాన్ని డెత్ బెడ్ ఎక్కించారు. 800 కోట్లు బకాయిలు పెట్టారు. మీరు బిల్లులు ఇయ్యరని కార్పొరేట్ దవాఖానలు కేసులు తీసుకోవడమే మానేశాయి.108ను కోమాలో పెట్టారు.104ను మాయం చేశారు. మొత్తంగా మీరు చెప్పిన అరోగ్య ప్రగతి మసిపూసి మారేడుకాయ చేసినట్లు గానే ఉంది.’ అని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version