రాసలీలల రాజయ్య, ఎన్కౌంటర్ల శ్రీహరి – వైఎస్‌ షర్మిల సంచలన వ్యాక్యలు

-

కడియం శ్రీహరి..పచ్చి తెలంగాణ ద్రోహి అని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. తెలంగాణకు YSR వ్యతిరేకి అని కడియం శ్రీహరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించినందుకు వ్యతిరేకా? లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చినందుకు వ్యతిరేకా? 30 వేల ఇండ్లు ఇచ్చినందుకు వ్యతిరేకా? రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించినందుకు YSR వ్యతిరేకా? అని నిలదీశారు.

ఉద్యమం పేరు చెప్పి అధికారం అనుభవిస్తున్న తెలంగాణ ద్రోహివి నువ్వు. తొమ్మిదేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి కనీసం డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాని నువ్వు కూడా మాట్లాడుతున్నావా..అని ప్రశ్నించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఇద్దరు నాయకులట.. MLA తాటికొండ రాజయ్య, MLC కడియం శ్రీహరి. ఇద్దరికీ ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ప్రజాసేవపై ధ్యాసే లేదని నిప్పులు చెరిగారు. రాసలీలల రాజయ్య అని శ్రీహరి అంటే.. ఎన్కౌంటర్ల శ్రీహరి అని రాజయ్య తిడతాడట. ఇద్దరూ దళిత నాయకులై ఉండి దళితుల సమస్యలపై ఏనాడూ నోరెత్తరని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version