కెసిఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు : ఏది చేతకాని సీఎం !

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పై వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల భర్తీ చేతకాని సీఎం వెంటనే రాజీనామా చేయాలని.. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పై వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.

నిరుద్యోగ చావులన్ని ప్రభుత్వ హత్యలు అని పేర్కొన్న ఆమె.. నిరుద్యోగానికి కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనర్హుడు అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు కో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నాడని వైఎస్ షర్మిల ఆవేదన వ్యాఖ్యమ చేశారు. సిఎం కేసీఆర్ వైఖరి దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా ఉందని .. వైఎస్ షర్మిల ఉద్యోగాల భర్తీ చేతకాని సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సచ్చేది నా వాడు కాదు కదా అని కేసీఆర్ అభిప్రాయపడుతున్నాడని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version