తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 8వ తెదీన పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల దూకుడును పెంచారు.. ఈ మేరకు ఇప్పటికే రంగారెడ్డి జిల్లా, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో షర్మిల పర్యటించారు. కేసీఆర్ సర్కారే టార్గెట్‌గా మాటలు దాడులు కూడా చేస్తున్నారు షర్మిల. వరుస పర్యటనల్లో భాగంగా ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి.. కేటీఆర్ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పార్టీ యూత్ అధ్యక్షుడు అరుణ్ విక్రమ్ రెడ్డిని షర్మిల పరామర్శించనున్నారు.
అనంతరం అల్మాస్ పూర్‌లో కరోనా మహమ్మారితో బలైన.. కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు. ఇవాళ్టి రాజన్న సిరిసిల్లా పర్యటనలో షర్మిల… ఏకంగా 490 కిలో మీటర్లు ప్రయాణించనున్నారు. షర్మిల పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా.. అయితే పార్టీ పెట్టకముందుకే వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఇటీవలే కొందరు నాయకులు షర్మిల పార్టీకి రాజీనామా చేశారు.