ఇంటర్ పరీక్ష ఫలితాలపై వై ఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా చదువులు సాగింది లేదు, ఆన్ లైన్ సౌకర్యం లేక పాఠాలు అందింది లేదని మండిపడ్డారు. సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశాక మళ్లీ ఫస్ట్ ఇయర్ పరీక్షల న్నారని… నెల రోజుల్లో పరీక్షలు పెట్టి ప్రిపరేషన్ కు టైం ఇవ్వకుండా ఫెయిల్ అయ్యేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ హడావుడి అనాలోచిత నిర్ణయాలకు 2 లక్షల మంది విద్యార్థుల జీవితాలు.. ఆగమయ్యేలా చేశారని కెసిఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ముగ్గురు చావులకు మీరే కారణం అయ్యారని.. మరింత మంది విద్యార్థులు మరణించక ముందే కనీసం గ్రేస్ మార్కులైన వేసి పాసయ్యే అవకాశం కల్పిస్తారో, లేక 1 st ఇయర్ ఫలితాలను రద్దు చేసి అందరినీ 2 nd ఇయర్ కు ప్రిపేర్ కావాలని చెప్తారో.. ప్రభుత్వం త్వరగా నిర్ణహించు కోవాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.