ఏపీలో రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ రైతుభరోసా సాయాన్ని ఈనెల 27న విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. మండస్ తుఫాన్ తో జరిగిన పంట నష్టానికి పెట్టుబడి రాయితీగా రూ.76 కోట్లను అదే రోజు సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమచేస్తారని ప్రకటించారు.
అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఫిబ్రవరి 28 లోగా రబీ ఈ-క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేయాలని చెప్పారు హరికిరణ్. వేసవిలో సాగయ్యే పంటలకు మార్చి, ఏప్రిల్ లో ఈ క్రాప్ నమోదుకు అవకాశం కల్పిస్తామని, మార్చి ఐదు నాటికి వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటుకు బ్యాంకు రుణం, డీలర్లకు కొనుగోలు ఆర్డర్లు జారీ చేయడం పూర్తి చేయాలని సూచించారు కమిషనర్.