మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కట్టు కథలతో చంద్రబాబు లిక్కర్ కేసును సృష్టించారని… ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేని కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. ప్రభుత్వం మద్యం షాప్ లను నిర్వహిస్తే స్కామ్ జరుగుతుందా అంటూ ప్రశ్నించారు.

అటు కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. కాగా, మిథున్ రెడ్డి అరెస్ట్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు పెద్దిరెడ్డి. లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని తప్పుడు కేసులు పెట్టారు… ప్రతిపక్ష పార్టీలను అదుపులోకి తీసుకోవాలని చంద్రబాబు వెర్రి ఆలోచనలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ చర్యలు చంద్రబాబు రాజకీయ జీవితం మీదే మాయని మచ్చగా ఏర్పడుతుందన్నారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.