వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రకటన చేశారు. వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ…. భీమవరంలో మండలి చైర్మన్ మోషన్ రాజుకి రాజీనామా పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా జయమంగళ వెంకట రమణ మాట్లాడుతూ… అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు ఏమి చేయలేకపోయానని…కనీసం పోలీసులకి ఫోన్ చేసే స్వతంత్రం కూడా లేదని వెల్లడించారు. పదవి ఇచ్చారు తప్ప పవర్ ఇవ్వలేదు… కొల్లేరు ప్రజల కోసం వైసీపీలో చేరానని వెల్లడించారు.
వైసీపీలో ఏమీ చేయలేక పోయాను… ఏదైనా సమస్య కోసం వైసీపీ ప్రభుత్వాన్ని కోరితే సజ్జలతో మాట్లాడు… ధనుంజయ రెడ్డితో మాట్లాడు… అనడమే తప్ప ఏ పని జరగలేదని ఆరోపణలు చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా కొల్లేరు ప్రజలకి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. ఏ పార్టీలోకి వెళ్ళేది నా ప్రజలతో మా నాయకులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతానని వివరించారు. సమస్యల గురించి మాట్లాడదామని వెళితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు.