చదువు విలువ తెలుసుకుని బాగా చదువుకుంటే భవిష్యత్తులో అదే మనల్ని కాపాడుతుంది. ఈ మాట ప్రతి ఒక్కరూ చెబుతుంటారు.. కానీ నేడు దేశంలో ఎంతో మంది యువత చదువుకుని ఖాళీగా అర్హతకు తగిన ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం డిగ్రీ చదివిన యువకులు సైతం టెన్త్ , ఇంటర్ ఇలా ఏ విద్యార్హతటిగొ జాబులు పడినా వదులుకోకుండా ప్రయత్నిస్తున్నారు. కాగా తాజాగా సెంట్రల్ గవర్నమేంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇది వరకు 12828 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగా, ఇప్పుడు 30041 GDS ఉద్యోగాలకు ప్రకటన వచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1058 ఉద్యోగాలను మరియు తెలంగాణాలో 961 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండే ఈ జాబ్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది.
యువతా మేలుకో: టెన్త్ అర్హతతో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-