భారత ప్రజలకు ఇది శుభవార్తే. దేశంలో కొత్తగా మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్ కు చెందిన జైడస్ కాడిలా తయారు చేసిన జై కోవ్- డీ వ్యాక్సిన్, కోవీషీల్డ్, కోవాగ్జిన్ తో పాటు ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కేంద్రం 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ పెట్టింది. మూడు డోసులుగా ఇచ్చే జై కోవ్ – డీ వ్యాక్సిన్ కోసం కేంద్రం దాదాపు 358 కోట్ల రూపాయలతో ఈ ఆర్డర్ పెట్టనట్లు తెలుస్తోంది. ప్రపంచంతో డీఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ గా జై కోవ్ -డి రికార్డ్ స్రుష్టించింది. 12 ఏళ్ల వయసు పైబడిన వారందరికి ఇచ్చే ఈ వ్యాక్సిన్ ను తయారు చేశారు. అయితే ముందుగా పెద్దలకు ఈవ్యాక్సిన్ ఇచ్చేందకు కేంద్రం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ మూడు డోసులను 28 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు కోటి డోసులను అందించే ఉన్నామని సదురు కంపెనీ కేంద్రానికి తెలిపింది.
మరోవైపు కోవాగ్జిన్ ను 2-18 ఏళ్ల వయస్సు ఉండే వారికి ఇచ్చేలా అత్యవసర అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు జై కోవ్ డీ అందుబాటులోకి వస్తే పిల్లలకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.