జనవరి 22 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

జనవరి –  22 – శుక్రవారం – పుష్యమాసం.

 

మేష రాశి:ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శివాష్టకం పారాయణం శివాష్టక పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి:ఈరోజు ఉద్యోగంలో ఇబ్బంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త ప్రమాదాల ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు చర్చించకుండా ఉండడం మంచిది. ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించడం మంచిది. తల్లిదండ్రుల మాటలను గౌరవించడం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః బిల్వాష్టకం పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

 

మిధున రాశి:ఈరోజు కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు అదృష్ట యోగంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు చేసుకుని ధన ప్రాప్తి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ధన కనక వస్తులను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. అన్ని రకాల పనుల్లో కార్యసిద్ధి పొందుతారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

 

కర్కాటక రాశి:డబ్బుల విషయంలో జాగ్రత్త !

ఈరోజంతా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో కాక ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మిత్రుల సహకారం తీసుకుంటారు. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు పొందుతారు. విద్యార్థులు గర్వ పడకుండా చదువు మీద ఏకాగ్రత పెట్టి చదవడం మంచిది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు సంకష్టహర గణపతి స్తోత్రం పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించండి.

 

సింహరాశి:ఈరోజు ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది !

ఈరోజు బాగుంటుంది కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని చేసిన ఆలోచించి చేయడం మంచిది లేదంటే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు, వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. అప్పుల బాధలు పెరిగి నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః శివానందలహరి పారాయణం చేసుకోండి, తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

 

తులారాశి:ఈరోజు పేరు ప్రఖ్యాతులు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుల బాధలు తీర్చుకొని ధన యోగం పొందుతారు. సమాజంలో గొప్ప వ్యక్తులతో పేరుప్రఖ్యాతులు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ఈరోజు ఉత్తమ విద్యార్థులగా పేరు పొందుతారు !

ఈరోజు అదృష్ట యోగంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ధన యోగం పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకున్న స్థానాలకు బదిలీ అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంతకు ముందున్న అనారోగ్యాలు తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థులగా పేరు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు గోవింద నామలు పారాయణం చేసుకోండి.

 

 ధనస్సు రాశి:తీర్ధ యాత్రలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షలో ఉత్తీర్ణత పొందుతారు. తీర్ధ యాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ధన లాభం పొందుతారు. గృహంలో శుభకార్యాన్ని తలపెట్టే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు నారాయణ కవచం స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 మకర రాశి:ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు తల్లి గారికి అనారోగ్య సూచన ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాణాల ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరు ఏం చెప్పిన నమ్మకుండా ఉండడం మంచిది, మోసపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది.

పరిహారాలుః విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ఈరోజు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ఆనంద యోగంగా ఉంటుంది. అప్పుల బాధలు తెరిపోయి మొండి బాకీలు వసూలు చేసుకొని ధన లాభం పొందుతారు. ఎలాంటి కష్టమైన పనులను కూడా ధైర్యంగా అనుకున్న సమయంలో పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. వ్యాపార పెట్టుబడి పెట్టి వ్యాపారంని విస్తరించి ధన లాభం పొందుతారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః లక్ష్మీ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

 మీన రాశి:ఈరోజు ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. కోపంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాల్లో ఆవేశపడకుండా ఉంటే ప్రమోషన్లు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు. ఈరోజంతా తెలివిగా సమయస్ఫూర్తిగా మాట్లాడడం, పనులు చేయడం కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు.

పరిహారాలుః ఈరోజు దుర్గా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news