జనవరి 10 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

మార్గశిరమాసం- జనవరి – 10.- ఆదివారం.

మేష రాశి: అప్పుల బాధలు తీరుతాయి !

ఈరోజు అంతా బాగుంటుంది. ఏ పని చేసిన ధైర్యసాహసాలతో ముందుకు సాగుతారు. అప్పుల బాధలు తీరుతాయి. ఈరోజు మొండిబకాయిలు వసూలవుతాయి. ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యాపారస్తులు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు నూతన గృహ ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి: ఈరోజు వ్యాపారంలో నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది, అధిక వేగంతో వెళ్లడం వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టాలు. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది.

పరిహారాలుః ఈరోజు గణేష స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి: ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు !

ఈ రోజు బాగుంటుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సఖ్యతగా , ఆనందంగా ఉంటారు. ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ఈ రోజు ధన లాభం కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు సరస్వతి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి: ఈరోజు వ్యాపారంలో లాభాలు !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు ఎంత కష్టమైన పనులు అయినా ధైర్యంగా చేస్తారు. ఈరోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొంది ఉన్నత చదువులకు ఉత్తీర్ణులు అవుతారు. ఈరోజు దైవ చింతన చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. ఈరోజు వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

సింహరాశి: ఈరోజు స్వల్ప నష్టాలు ఏర్పడతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు అప్పుల బాధలు పెరుగుతాయి. ఈరోజు అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఈరోజు చేతగానితనంతో పనులను వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఈ రోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ పెట్టి చదువు కోవడం మంచిది. ఈరోజు ఏ విషయంలో అయినా సొంత నిర్ణయాలు తీసుకోవడం కంటే ఇతరులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెద్దవారిని మాటలను గౌరవించడం మంచిది.

పరిహారాలుః ఈరోజు దుర్గా అష్టోత్తర పారాయణం చేసుకొండి.

 

కన్యారాశి: ఆహార విషయంలో జాగ్రత్త  !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారులతో బొత్తి డి పెరుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార నష్టం జరుగుతుంది. ఈరోజు వివాహాది సంబంధ కార్యా క్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది.

పరిహారాలుః ఈ రోజు లింగాష్టకం పారాయణం చేసుకొండి.

 

తులారాశి: ఈరోజు శత్రువులు మిత్రులు అవుతారు !

ఈ రోజంతా బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్యము ఈరోజు తొలగితుంది. ఈరోజు శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఈరోజు వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలమైన రోజు. బంధుమిత్రుల రాకతో సంతోష పెడుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి: ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు కఠినంగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఈరోజు ధైర్యంగా ఉండటం వల్ల అన్ని పనులు సులువుగా సాగుతాయి. ఈరోజు తక్కువగా మాట్లాడటం మంచిది. ఎవరితోనైనా వివాదాలు తగాదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఈ రోజు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. మద్యపానం చేసి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు దైవనామస్మరణ చేసుకోండి.

పరిహారాలుః ఈరోజు దత్తాత్రేయ పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి: ధన లాభం కలుగుతుంది !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు అందరితో కలిసి సంతోషంగా ఉంటారు. ఈ రోజు అప్పుల బాధలు తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. ఈరోజు అనుకున్న పనిని కష్టపడి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు.

 పరిహారాలుః ఈరోజు రామ నామ పారాయణం చేసుకోండి.

 

మకర రాశి: ఈరోజు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది !

ఈరోజు అన్నదమ్ములతో సఖ్యతగా ఉండటం మంచిది. అనవసరపు వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు విద్యార్థులు చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. వివాహ సంబంధ విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి: స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు !

ఈ రోజంతా బాగుంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ధన లాభం కలుగుతుంది. ఈరోజు వివాహాది నిశ్చయ తాంబూలాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈరోజు అనారోగ్యాలన్నీ తొలగిపోయి, ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈ రోజు పెద్ద వారి మాటలను గౌరవిస్తారు.

పరిహారాలుః ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి: ఈరోజు ఖర్చు తక్కువగా ఉంటుంది !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఆరోగ్య విషయంలో బాగుంతుంది. ఈరోజు ప్రతి పనిని చక్కగా పూర్తి చేసి ఆదరణ పొందుతారు. ఈరోజు గృహ స్థలాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version