Big Shock To Jagan Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Tue, 27 Sep 2022 08:39:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 జగన్ కి కేంద్రం ఝలక్….రాజధాని కోసం డబ్బులు ఇవ్వం ! https://manalokam.com/news/big-shock-to-jagan.html Tue, 27 Sep 2022 08:39:55 +0000 https://manalokam.com/?p=395378 రాజధానిపై జగన్ కి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణం కోసం శివరామ కృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు 29 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు ఏపి ప్రభుత్వ అధికారులు. చట్ట ప్రకారం 2500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికి 1500 కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్రం వారికి క్లారిటీ ఇచ్చింది. ఈ మొత్తానికి సంబంధించిన ఖర్చుల ధృవీకరణపత్రాలను ( […]

The post జగన్ కి కేంద్రం ఝలక్….రాజధాని కోసం డబ్బులు ఇవ్వం ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
రాజధానిపై జగన్ కి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణం కోసం శివరామ కృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు 29 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు ఏపి ప్రభుత్వ అధికారులు. చట్ట ప్రకారం 2500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికి 1500 కోట్ల రూపాయలు విడుదల చేశామని కేంద్రం వారికి క్లారిటీ ఇచ్చింది.

ఈ మొత్తానికి సంబంధించిన ఖర్చుల ధృవీకరణపత్రాలను ( యు.సి) సమర్పించాలని, ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ( రూ. 1000 కోట్లు) విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని సూచించారు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి. దీంతో ఏపీకి షాక్‌ తగిలింది.

విభజన చట్టంలోని 9 వ షెడ్యూల్ లో ఆస్తుల విభజన పై షీలా బేడీ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏపి అంగీకరించిందని, తెలంగాణ వ్యతిరేకించిందని తెలిపారు రాష్ట్ర అధికారులు. షీలా బేడీ కమిటీ సిఫార్సులు తప్పనిసరి అమలుకు కేంద్రమే ఉత్తరువులు జారీ చేసేవిధంగా ఉన్న అవకాశం పై
న్యాయ సలహా కోరుతామని చెప్పారు కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

The post జగన్ కి కేంద్రం ఝలక్….రాజధాని కోసం డబ్బులు ఇవ్వం ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>