chikoti praveen on BJP Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Wed, 13 Sep 2023 05:33:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 బీజేపీలో చేర్చుకోకపోవడంపై స్పందించిన చీకోటి ప్రవీణ్ https://manalokam.com/news/telangana/chikoti-praveen-comments-on-bjp.html Wed, 13 Sep 2023 05:32:30 +0000 https://manalokam.com/?p=546064 తనను బీజేపీలో చేర్చుకోకపోవడంపై క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్​ స్పందించారు. మంగళవారం రోజున కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి వెళ్లిన తనకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలు బాధించాయని అన్నారు. ఆ పరిణామాలు తన అభిమానులను నిరుత్సాహ పరిచాయని తెలిపారు. తనంటే భయం ఏంటో అర్థమైందని.. ఏ శక్తులు కలిసినా చీకోటిని ఏం చేయలేవని స్పష్టం చేశారు. కుళ్లు రాజకీయాలు చేస్తున్న వాళ్లకు నా సవాల్.. మీ లెక్క వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు. మీ […]

The post బీజేపీలో చేర్చుకోకపోవడంపై స్పందించిన చీకోటి ప్రవీణ్ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
తనను బీజేపీలో చేర్చుకోకపోవడంపై క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్​ స్పందించారు. మంగళవారం రోజున కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి వెళ్లిన తనకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలు బాధించాయని అన్నారు. ఆ పరిణామాలు తన అభిమానులను నిరుత్సాహ పరిచాయని తెలిపారు. తనంటే భయం ఏంటో అర్థమైందని.. ఏ శక్తులు కలిసినా చీకోటిని ఏం చేయలేవని స్పష్టం చేశారు.

కుళ్లు రాజకీయాలు చేస్తున్న వాళ్లకు నా సవాల్.. మీ లెక్క వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు. మీ రాజకీయం మీరు చేయండి.. నా రాజకీయం నేను చేస్తాను. నాకు జరిగిన అవమానం చూసి ఇప్పుడు సంతోష పడుతున్న వారికి త్వరలోనే గదిలో కూర్చొని ఏడ్చే రోజు తీసుకువస్తాను అని హెచ్చరిస్తూ చీకోటి ప్రవీణ్ ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే.. బీజేపీలో చేరడానికి పెద్దఎత్తున తన అనుచరులతో ర్యాలీగా బయల్దేరి చీకోటి ప్రవీణ్ మంగళవారం రోజున నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి  చేరుకున్నారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి….  చీకోటి రాకముందే పార్టీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లిపోయారు. భారీ హంగు ఆర్భాటంతో వచ్చిన చికోటి అనుచరులు  పడిగాపులు కాసి చివరుకు ఆగ్రహంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

The post బీజేపీలో చేర్చుకోకపోవడంపై స్పందించిన చీకోటి ప్రవీణ్ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>