galaxy tab s7+ Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Wed, 26 Aug 2020 11:52:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 శాంసంగ్‌ నుంచి గెలాక్సీ ట్యాబ్‌ S7, ట్యాబ్‌ S7+ లాంచ్‌! https://manalokam.com/technology/samsung-launches-galaxy-tab-s7-and-tab-s7-in-india.html Wed, 26 Aug 2020 11:52:04 +0000 https://manalokam.com/?p=120192 నేటి తరానికి చెందిన యువత ఒకే స్మార్ట్ ఫోన్ ను, ట్యాబ్ ను ఎక్కువ కాలం వాడటానికి ఆసక్తి చూపడం లేదు. కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్లను, ట్యాబ్ లను వాడటానికి యువత ప్రాధాన్యతనిస్తోంది. దీంతో కంపెనీలు సైతం ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ, సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 సిరీస్ లో సరికొత్త మోడళ్లను […]

The post శాంసంగ్‌ నుంచి గెలాక్సీ ట్యాబ్‌ S7, ట్యాబ్‌ S7+ లాంచ్‌! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
నేటి తరానికి చెందిన యువత ఒకే స్మార్ట్ ఫోన్ ను, ట్యాబ్ ను ఎక్కువ కాలం వాడటానికి ఆసక్తి చూపడం లేదు. కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ ఫోన్లను, ట్యాబ్ లను వాడటానికి యువత ప్రాధాన్యతనిస్తోంది. దీంతో కంపెనీలు సైతం ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ, సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 సిరీస్ లో సరికొత్త మోడళ్లను లాంఛ్ చేసింది.

గత కొన్ని నెలల నుంచి శాంసంగ్ గెలాక్సీ సిరీస్ వివిధ మోడళ్లను లాంఛ్ చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7, ఎస్ 7 ప్లస్ పేరుతో నేడు కొత్త మోడళ్లు లాంఛ్ అయ్యాయి. గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 వైఫై వేరియంట్ ప్రారంభ ధర 55,999 రూపాయలు. శాంసంగ్, రిలయన్స్ రిటైల్ ద్వారా దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ట్యాబ్‌ ఎస్ 7, ట్యాబ్‌ ఎస్ 7 ప్లస్ ఎల్‌టీఈ వేరియంట్ల ధర వరుసగా 63,999 రూపాయలు, 79,999 రూపాయలుగా నిర్ణయించామని కంపెనీ ప్రకటించింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్ సైట్లలో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఫోన్ల కోసం ఎంపిక చేసిన రిటైల్ ఔట్ లెట్లు అందుబాటులో ఉంటాయని శాంసంగ్ తెలిపింది. మిస్టిక్ బ్రాంజ్‌, మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్ రంగులలో గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7, గెలాక్సీ ట్యాబ్ ఎస్ 7 ప్లస్ సిద్ధంగా ఉన్నాయని కీలక ప్రకటన వెలువడింది. ప్రీ ఆర్డర్ల కొరకు ట్యాబ్ లను కంపెనీ సిద్ధం చేసినట్టు ప్రకటించింది.

The post శాంసంగ్‌ నుంచి గెలాక్సీ ట్యాబ్‌ S7, ట్యాబ్‌ S7+ లాంచ్‌! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>