gifts to avoid Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Fri, 14 Mar 2025 14:38:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 ఈ వస్తువులను ఎవరికీ గిఫ్ట్ గా ఇవ్వకూడదు.. లేదంటే ఎప్పుడూ దురదృష్టమే..! https://manalokam.com/devotion/vastu/avoid-these-gifts-to-be-happy.html Fri, 14 Mar 2025 12:30:04 +0000 https://manalokam.com/?p=721167 వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటించడం వలన జీవితంలో ఎంతో ఉపయోగం ఉంటుంది మరియు చాలా శాతం మంది వాటిని పాటిస్తారు. దాంతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని కూడా పొందుతారు. ఎప్పుడైతే వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటిస్తారో ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది మరియు ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. రోజువారి జీవితంలో మాత్రమే కాకుండా ఎవరికైనా బహుమతులను ఇచ్చేటప్పుడు కూడా వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను తప్పకుండా పాటించాలి. ఇటువంటి బహుమతులు ఇవ్వడం వలన […]

The post ఈ వస్తువులను ఎవరికీ గిఫ్ట్ గా ఇవ్వకూడదు.. లేదంటే ఎప్పుడూ దురదృష్టమే..! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటించడం వలన జీవితంలో ఎంతో ఉపయోగం ఉంటుంది మరియు చాలా శాతం మంది వాటిని పాటిస్తారు. దాంతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని కూడా పొందుతారు. ఎప్పుడైతే వాస్తు శాస్త్రంలో చెప్పిన విషయాలను పాటిస్తారో ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది మరియు ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. రోజువారి జీవితంలో మాత్రమే కాకుండా ఎవరికైనా బహుమతులను ఇచ్చేటప్పుడు కూడా వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను తప్పకుండా పాటించాలి. ఇటువంటి బహుమతులు ఇవ్వడం వలన ఎంతో దురదృష్టం వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాచీ లేక గడియారం వంటివి బహుమతులుగా ఇవ్వడం వలన బంధాలు అనేవి బలహీనంగా మారతాయి మరియు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక గడియారాలను అస్సలు ఇవ్వకూడదు. సహజంగా మగవారికి లేక ఆడవారికి పర్సులు లేక వాలెట్లు వంటివి బహుమతులుగా అందిస్తారు. అయితే ఈ విధంగా ఖాళీ వాలెట్లను ఇవ్వడం వలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కనుక ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే వాలెట్లలో కొంచెం డబ్బును పెట్టి ఇవ్వవచ్చు. చాలా మంది ఆకర్షణీయంగా ఉంటాయని ఆర్టిఫిషియల్ పువ్వులను బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ పూవులు ఇస్తారో ఎదుగుదల లేకుండా చేస్తుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా తాజ్ మహల్ వంటి ప్రతిరూపాలను బహుమతులుగా ఇవ్వడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ప్రేమకి చిహ్నం అయినప్పటికీ కూడా తాజ్ మహల్ విడిపోవడం మరియు మరణానికి కూడా సంకేతం. కనుక దీనిని బహుమతిగా ఇవ్వకూడదు. నల్లటి దుస్తులను లేక వస్తువులను ఇతరులకు బహుమతులుగా ఇవ్వడం వలన ఎంతో ప్రతికూల శక్తి వస్తుంది. ఇతరులకు బహుమతి ఇచ్చేటప్పుడు పదునైన వస్తువులను కూడా ఇవ్వకూడదు. వాటిని ఇవ్వడం వలన గొడవలు ఎక్కువ అవుతాయి. కనుక ఎలాంటి పరిస్థితుల్లో అయినా సానుకూల శక్తిని ఇచ్చేటువంటి బహుమతులను మాత్రమే ఇవ్వండి.

The post ఈ వస్తువులను ఎవరికీ గిఫ్ట్ గా ఇవ్వకూడదు.. లేదంటే ఎప్పుడూ దురదృష్టమే..! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>