Rahul Gandhi Wayanad tour today Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Thu, 01 Aug 2024 03:03:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 నేడు వయనాడ్ లో రాహుల్, ప్రియాంకా గాంధీ పర్యటన https://manalokam.com/news/national/rahul-gandhi-along-with-priyanka-gandhi-to-visit-wayanad-today.html Thu, 01 Aug 2024 03:03:14 +0000 https://manalokam.com/?p=657595 కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 287చేరింది. ఇంకా 240 మంది ఆచూకీ దొరకలేదు. తాత్కాలిక వంతెనలు నిర్మించి సహాయక బృందాలు ఘటనాస్థలి నుంచి ప్రజలను రక్షిస్తున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఇవాళ పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ గతంలో వయనాడ్ ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. వయనాడ్తో […]

The post నేడు వయనాడ్ లో రాహుల్, ప్రియాంకా గాంధీ పర్యటన appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 287చేరింది. ఇంకా 240 మంది ఆచూకీ దొరకలేదు. తాత్కాలిక వంతెనలు నిర్మించి సహాయక బృందాలు ఘటనాస్థలి నుంచి ప్రజలను రక్షిస్తున్నాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఇవాళ పర్యటించనున్నారు.

రాహుల్ గాంధీ గతంలో వయనాడ్ ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. వయనాడ్తో ఆయనకు ఎనలేని అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజలంటే ఆయనకు అభిమానం. రాహుల్ అన్నా వయనాడ్ ప్రజలకు అభిమానమే. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రకృతి ప్రకోపానికి గురైన ప్రజలను పరామర్శించేందుకు ఆయన ఇవాళ వయనాడ్కు రానున్నారు.

మరోవైపు తమ రాష్ట్రంలో ఇటువంటి విషాదాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మండక్కై, చూరాల్‌మల ప్రాంతాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని.. ఈ ప్రాంతంలో తాత్కాలిక వంతెనను శుక్రవారం నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. రెండు రోజుల సహాయక చర్యల్లో 1,592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు.

The post నేడు వయనాడ్ లో రాహుల్, ప్రియాంకా గాంధీ పర్యటన appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>