tea with hibiscus leaf and hibiscus flower Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Sun, 16 Jan 2022 09:55:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 మందారతో టీ తో శరీరంలో ఈ మార్పులు ఖాయమట..ఎలా చేయాలంటే https://manalokam.com/news/tea-with-hibiscus-leaf.html Sun, 16 Jan 2022 09:55:34 +0000 https://manalokam.com/?p=262839 మందార ఆకులతో జుట్టుకు కావలసిన పోషకాలు ఉన్నాయని తెలుసు..మందారంతో ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని మీకు తెలుసా..చైనీస్‌ ఔషదాల్లో శాతాబ్ధాలుగా మందారాన్ని వాడుతున్నారు. ఈరోజు మనం మందార పువ్వుతో టీ చేసుకుని తాగడం , దానివల్ల వచ్చే ఉపయోగాలు గురించి చూద్దాం. ఎర్రటి మందార చాయ్ తాగితే అందంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందట.. మందార టీలో విటమిన్ సీ, విటమిన్ ఏ తో పాటు జింక్, ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. […]

The post మందారతో టీ తో శరీరంలో ఈ మార్పులు ఖాయమట..ఎలా చేయాలంటే appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
మందార ఆకులతో జుట్టుకు కావలసిన పోషకాలు ఉన్నాయని తెలుసు..మందారంతో ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని మీకు తెలుసా..చైనీస్‌ ఔషదాల్లో శాతాబ్ధాలుగా మందారాన్ని వాడుతున్నారు. ఈరోజు మనం మందార పువ్వుతో టీ చేసుకుని తాగడం , దానివల్ల వచ్చే ఉపయోగాలు గురించి చూద్దాం.

ఎర్రటి మందార చాయ్ తాగితే అందంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందట.. మందార టీలో విటమిన్ సీ, విటమిన్ ఏ తో పాటు జింక్, ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ సీ జట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవే కాదు మందారతో ఇంకా ఎన్నో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మందార టీ టో ప్రయోజనాలు:

డైలీ..మందార టీని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

న్రూట్రియెంట్స్, ఫ్లేవనాయిడ్స్, మినలర్స్ ఎక్కువగా ఉండే మందారతో ఒంట్లో కొవ్వు తగ్గుతుంది.

యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన మెటబాలిజం పెరిగి ఊబకాయం తగ్గుతుంది.

మందారలో యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాల వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.

యూరినేషన్ పెరుగుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.

హిబిస్కస్ యాంటీ డిప్రసెంట్‌గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఇందులలో ఫ్లేవనాయిడ్స్ మనలో ఉండే నెగెటివ్ థింకింగ్‌ను దూరం చేస్తుంది. బాధలో ఉన్నప్పుడు గానీ, ఒత్తిడిలో ఉన్నప్పుడు గానీ.. కప్పు మందార టీ తాగితే రిలాక్స్‌గా ఉంటుంది.

మందార టీలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్లూ లాంటి సమస్యలు దరి చేరవు.

మందార టీని క్రమం తప్పకుండా తాగితే వెంట్రుకలు ఊడడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా బాగా పెరుగుతుంది. చుండ్రు, తెల్ల వెంట్రుకలు కూడా తగ్గుతాయి.

అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం నుంచి చర్మానికి రక్షణ ఇస్తుంది. శరీరంపై ముడతలను తగ్గించి నిత్య యవ్వనంగా ఉంచుతుంది. ఏటేటా మీ వయసు తగ్గుతుందే గానీ పెరగదు.

మరి ఇన్ని లాభాలు ఉన్నాయి అని తెలిశాక తాగాలనిపిస్తుంది కదా..ఎలా చేయాలంటే..

మందార పువ్వులను ఎండలో ఆరబెట్టి ఇంట్లో నిల్వచేసుకోవాలి. 2 లేదా 3 టీ స్పూన్‌లో ఎండిన మందార రేకులను 2 కప్పుల నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఫిల్టర్‌ చేసి రుచి కోసం కాస్త తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. వేడి వేడిగా తాగితే అద్భుతంగా ఉంటుంది.

-Triveni Buskarowthu

The post మందారతో టీ తో శరీరంలో ఈ మార్పులు ఖాయమట..ఎలా చేయాలంటే appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>