tittle Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Sat, 22 Feb 2020 03:15:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 ఎన్టీఆర్, త్రివిక్రమ్ టైటిల్ అనౌన్స్ , ఇదే టైటిల్…! https://manalokam.com/news/ntrtrivikram-new-movie-tittle-announced.html Sat, 22 Feb 2020 03:15:47 +0000 https://manalokam.com/?p=78042 టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఆ సినిమా నిలిచింది. రాజకీయ నేపధ్యంలో వచ్చిన ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన, రాయలసీమ యాస అన్నీ కూడా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వసూళ్లు కూడా భారీగా సాధించింది ఆ సినిమా. ఇక తాజాగా […]

The post ఎన్టీఆర్, త్రివిక్రమ్ టైటిల్ అనౌన్స్ , ఇదే టైటిల్…! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఆ సినిమా నిలిచింది. రాజకీయ నేపధ్యంలో వచ్చిన ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన, రాయలసీమ యాస అన్నీ కూడా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వసూళ్లు కూడా భారీగా సాధించింది ఆ సినిమా.

ఇక తాజాగా ఎన్టీఆర్ తో మరో సినిమా ప్లాన్ చేసాడు త్రివిక్రమ్. అల వైకుంఠపురములో సినిమాతో మంచి జోష్ మీద ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. తాజాగా ఈ సినిమా అప్డేట్ బయటకు వచ్చింది. టైటిల్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ టక్ చేసుకుని ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసింది.

“అయిననూ పోయిరావలె హస్తినకు” అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఈ టైటిల్ ఆధారంగా చూస్తే ఈ సినిమా రాజకీయ నేపధ్యంలోనే వస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్టీఆర్ 30 వ సినిమాగా వస్తుంది. ఈ సినిమాకు నిర్మాతలుగా ఎస్ రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

The post ఎన్టీఆర్, త్రివిక్రమ్ టైటిల్ అనౌన్స్ , ఇదే టైటిల్…! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>