YUVARAJ SINGH FIFTY IN 12 BALLS Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Wed, 27 Sep 2023 05:00:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 FASTEST FIFTY: యువరాజ్ సింగ్ రికార్డ్ బద్దలు కొట్టిన నేపాల్ క్రికెటర్ ! https://manalokam.com/news/yuvaraj-singh-fastest-t20i-fifty-broken-by-nepal-player-deependra-singh-airee.html Wed, 27 Sep 2023 05:00:03 +0000 https://manalokam.com/?p=551292 ఆసియన్ గేమ్స్ లో భాగంగా చైనా లోని గ్యాంగ్జౌ లో ఆటహాసంగా స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఇక క్రికెట్ లో ఈ రోజు నుండి పురుషుల టీ 20 మ్యాచ్ లో మొదటి మ్యాచ్ మంగోలియా మరియు నేపాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు బద్దలయ్యాయి.. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత ఓవర్ లలో మూడు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు స్వల్ప స్కోర్ లకే వెనుతిరిగినా […]

The post FASTEST FIFTY: యువరాజ్ సింగ్ రికార్డ్ బద్దలు కొట్టిన నేపాల్ క్రికెటర్ ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఆసియన్ గేమ్స్ లో భాగంగా చైనా లోని గ్యాంగ్జౌ లో ఆటహాసంగా స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఇక క్రికెట్ లో ఈ రోజు నుండి పురుషుల టీ 20 మ్యాచ్ లో మొదటి మ్యాచ్ మంగోలియా మరియు నేపాల్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు బద్దలయ్యాయి.. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత ఓవర్ లలో మూడు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు స్వల్ప స్కోర్ లకే వెనుతిరిగినా కుషాల్ మల్లా (137) మరియు రోహిత్ పౌడెల్ (61) లు జట్టును ముందుండి నడిపించారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన దీపేంద్ర సింగ్ ఐరీ వరల్డ్ రికార్డు ను బద్దలు కొట్టాడు.. ఇంతకు ముందు వరకు ఇండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పైన టీ 20 వరల్డ్ కప్ లో 12 బంతుల్లో అర్ద సెంచరీ చేసి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు.

కానీ తాజాగా జరిగిన మ్యాచ్ లో దీపేంద్ర సింగ్ ఐరీ కేవలం 9 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 8 సిక్సులు ఉండడం గమనార్హం. దీనితో యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు అయింది.. అందుకే క్రికెట్ లో ఏ రికార్డ్ కూడా చాలా కాలం ఉండదు.. ఎవరో ఒకరు బద్దలు కొట్టాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యాట్ర్ పేరు మారుమ్రోగిపోతోంది.

The post FASTEST FIFTY: యువరాజ్ సింగ్ రికార్డ్ బద్దలు కొట్టిన నేపాల్ క్రికెటర్ ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>