రూపాయి ఖర్చులేకుండా వ్యాపారం..క్లిక్‌ అయితే నెలకు లక్ష..కంప్యూటర్‌ ఉంటే చాలు..!!

-

ఈ రోజుల్లో సొంత వ్యాపారం చేయాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే అందరికీ వచ్చే ప్రధాన సమస్య పెట్టుబడి.. పెట్టుబడికి సరిపడా డబ్బులేక ఆగిపోతున్నారు. కానీ.. డబ్బుతో పనిలేకుండా వ్యాపారం చేయొచ్చు అంటే.. అలా అని అది ఏం పనికిరాని బిజినెస్‌ కాదు..లాభాల పంట.. రూపాయి పెట్టుబడి లేకుండా.. వ్యాపారం చేయొచ్చు.. ఇంతకీ అది ఏం వ్యాపారమా అనుకుంటున్నారా..?
ఈ రోజుల్లోని యువతలో సోషల్ మీడియా, పాలిటిక్స్‌పై విపరీతమైన అవగాహన ఉంది. ఈ అవగాహనను పెట్టుబడిగా మార్చుకుని అద్భుతాలు సృష్టించవచ్చు. మీరే మరో పది మందికి పని కల్పించే స్థాయికి చేరొచ్చు. ప్రస్తుతం అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఖాతాలను ఏర్పాటు చేసుకుని తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేస్తారు. అయితే ఖాతాలన్నీ వారి పేరు మీద కనిపిస్తూ ఉన్నా వాటిని మెయింటేన్ చేసే వారు మాత్రం వేరే వారు ఉంటారు
సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా నిపుణులను నియమించుకుంటున్నారు. ఆయా నిపుణుల ద్వారా వ్యక్తిగత ఖాతాలు మాత్రమే కాకుండా వేర్వేరు పేర్లతో కూడా ఖతాలను కూడా తెరిచి తద్వారా వారికి తగిన పబ్లిసిటీ లభించేలా, వారు చేసే పనులు ప్రజల్లోకి వెళ్లేలా చేసుకుంటారు.
మీకు కూడా ఇలా సోషల్ మీడియాపై అవగాహన, ఖాతాల నిర్వహణపై ఇంట్రస్ట్‌ ఉంటే.. ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్‌గా వ్యవహరించవచ్చు. దీనికి ఎక్కువ శ్రమ ఉంటుంది అనుకుంటే పొరపాటే. మీరు ఇంట్లోనే ఉండి కంప్యూటర్ ముందు కూర్చుని వారు పంపించే ఫొటోలు, ఇతర కంటెంట్‌ను ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా తీర్చితిద్ది సోషల్ మీడియా ఖాతాల్లో అప్ లోడ్ చేస్తే చాలు
అయితే ..మీకు ఫొటోషాప్, వీడియో ఎడిటింగ్‌పై అవగాహన ఉంటే చాలు.. ఈ పనిలో మరింతగా రాణించవచ్చు. మీ పని తీరు, మీరు పని చేసే వ్యక్తి స్థాయి ఆధారంగా మీకు పారితోషకం ఉంటుంది. అయితే, మొదటగా చిన్న చిన్న స్థాయి వ్యక్తులకు సోషల్ మీడియా అడ్మిన్ గా వ్యవహరించి పనిలో పట్టు సాధిస్తే.. మంచి అవకాశాలు లభిస్తాయి
ఇందులో పేరు తెచ్చుకుంటే.. ఒకే సారి అనేక మంది సోషల్ మీడియా ఖాతాలను మెయింటెన్ చేసే అవకాశం కూడా లభించే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు మీ కింద కొందరిని నియమించుకుని మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. తద్వారా లక్షలు సంపాధించుకోవచ్చు.(
మొదటి అవకాశం లభించి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే వరకు మాత్రం కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఇందు కోసం ఇప్పటికే ఇలాంటి పని చేసే వారిని కలవడం, ప్రముఖులను సంప్రదించి అవకాశం కోసం అభ్యర్థించడం చేయాలి. అవకాశం లభిస్తే కొన్ని రోజులు ఫ్రీగా పని చేయడానికి కూడా వెనకాడొద్దు.
ఒక్క సారి మీరు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారంటే.. తర్వాత అవకాశాలు మిమ్ముల్ని వెతుక్కుంటూ వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. తద్వారా లక్షలు ఆఫర్ చేసి మిమ్ముల్ని ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్‌గా నియమించుకుంటారు.
అయితే ఇది అనుకున్నంత సులువు కాదు.. కాస్త టైమ్‌ పడుతుంది. చదువుకునే వారు అయితే చేయొచ్చు. అటు టైమ్‌ కూడా వేస్ట్‌ కాదు. ఎలాగూ సోషల్‌ మీడియాను విపరీతంగా వాడతారు కాబట్టి..ఆ వాడేదేదో ఇక్కడ వాడితే సరిపోదుతుంది.. అలా డిగ్రీలు చేసేప్పుడే సైడ్‌ బిజినెస్‌ చేశారంటే..చదువు అయిపోయే సరికి మీ పని మీద మీకు పట్టు వస్తుంది. లక్‌ బాగుంటే.. అదే కెరీర్‌గా మలుచుకోవచ్చు.!!
Attachments area

Read more RELATED
Recommended to you

Latest news