ఇప్పటికే పూర్తిగా టెక్నాలజీకే అలవాటు పడిపోతున్నాం. ఈ తరుణంలో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. షియోమి, సోనిక్ కంపెనీలు ఈ బ్రెష్‌లను ప్రవేశపెట్టాయి. ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు పళ్లను శుభ్రంగా అన్ని వైపుల నుంచి బ్రష్ చేస్తాయి. దీని ధర రూ.1500. అద్భుతమైన టెక్నాలజీతో సోనిక్ టూత్ బ్రష్‌ను తయారు చేశారు.
ఈ బ్రష్ నిమిషానికి 40 వేల స్ట్రోక్‌లు చేస్తూ పళ్లను శుభ్రం చేస్తుంది. ఈ బ్రష్ దంతాల అమరికకు అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్రష్‌కు అనేక ఆప్షన్లు ఇచ్చారు. వైటెనింగ్, క్లీనింగ్, సెన్సిటివ్, పాలిషింగ్. బ్రష్ చార్జింగ్ సామర్థ్యం కూడా చాలా బాగుంది. నాలుగు గంటలు చార్జింగ్ పెడితే 25 రోజులు వినియోగించుకోవచ్చు.మనం ఫిక్స్ చేసిన సమయానికి ఆపినా ఆపకపోయినా బ్రషింగ్ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. తిరిగి వినియోగించిప్పుడు మనం చివరగా వినియోగించిన బ్రషింగ్ ఆప్షన్
ను ప్రారంభిస్తుంది.ఒకవేళ మీకు అవసరం అయితే మార్చుకోవచ్చు. ఈ అద్భుతమైన బ్రష్ ను వినియోగించేటప్పుడు ఎలాంటి సమస్య రాదనిన సోనిక్ బ్రష్ తయారీ దారులు చెబుతున్నారు. కేవలం రెండు నిమిషాల సహాయంతో దంతాలను ఎంతో అద్భుతంగా క్లీన్ చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది.