ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న ఫీచర్లనే కొత్త ఐఫోన్లలో ఇచ్చారు.. ఆపిల్ చేసిందేమిటి..?

-

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా తన కొత్త ఐఫోన్లను విడుదల చేసింది. పలు నూతన ఫీచర్లు కూడా ఈ ఫోన్లలో వినియోగదారులకు లభిస్తున్నాయి. అయితే ఆ ఫీచర్లన్నీ ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా తన కొత్త ఐఫోన్లను.. ఐఫోన్ 11, 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ పేరిట విడుదల చేసింది. ఈ క్రమంలోనే పలు నూతన ఫీచర్లు కూడా ఈ ఫోన్లలో వినియోగదారులకు లభిస్తున్నాయి. అయితే ఆ ఫీచర్లన్నీ ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. అవును.. మీరు విన్నది నిజమే.. మరి ఆపిల్ కొత్త ఐఫోన్లలో నూతనంగా అందించిన ఫీచర్లేమిటి..?

iphone 11 series phones features already available in android phones

ఐఫోన్ 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లలో వెనుక భాగంలో ఉన్న 3 కెమెరాల సెటప్‌ను ఇప్పటికే అనేక ఆండ్రాయిడ్ ఫోన్లలో అందిస్తున్నారు. పలు మిడ్‌రేంజ్ ఫోన్లు మొదలు కొని ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో 3 నుంచి 4 వరకు వెనుక భాగంలో కెమెరాలను అందిస్తున్నారు. అలాగే ఈ సారి వచ్చిన కొత్త ఐఫోన్లలో డార్క్ మోడ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. నిజానికి ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌లో గతేడాది గూగుల్ తన పిక్సల్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇక ఆ ఫీచర్ కూడా కొత్తేమీ కాదు. అలాగే ఫాస్ట్ చార్జింగ్, ఓలెడ్ డిస్‌ప్లేలు కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ ఆపిల్ గతేడాది నుంచే తన ఐఫోన్లలో ఈ రెండు ఫీచర్లను అందిస్తోంది. మరిక ఆపిల్ తన ఐఫోన్లలో యూజర్లకు కొత్తగా అందించేమీ లేదు. ఆ ఫీచర్లన్నీ ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి.

అయితే ఈ సారి ఐఫోన్లలో రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే తదితర ఫీచర్లను ఆపిల్ అందిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అవి కూడా ఈసారి అందుబాటులో లేవు. అలాగే కొత్త ఐఫోన్లలో 5జీ ఫీచర్ కూడా వస్తుందని భావించారు. ఇప్పటికే పలు ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్లు 5జీ ఫీచర్‌తో విడుదలయ్యాయి. దీంతో ఆపిల్ ఫోన్లలోనూ ఆ ఫీచర్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ 5జీ ఫీచర్‌ను ఆపిల్ వచ్చే ఏడాది ఐఫోన్లలో అందిస్తుందని తెలిసింది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థ ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఉన్న ఫీచర్లనే తన ఐఫోన్లలో అందిస్తూ వస్తుంది తప్ప కొత్తగా ఇస్తున్న ఫీచర్లేమీ లేవని పలువురు ఐఫోన్ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. మరి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆపిల్ వచ్చే ఏడాదైనా ఆండ్రాయిడ్‌కు భిన్నమైన ఫీచర్లను ఐఫోన్ యూజర్లకు అందిస్తుందా, లేదా.. చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news