ఇండియాలో లాంచ్‌ అయిన Dell Alienware m15 R7 గేమింగ్‌ ల్యాప్‌టాప్‌

-

ల్యాప్‌టాప్‌ అంటే వర్క్‌ చేసుకోవడానికి మాత్రమే కాదు..ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూడటానికి, పాటలు వినడానికి, గేమ్స్‌ ఆడుకోవడానికి అన్ని విధాలుగా సెట్‌ కావాలి.. అందుకు తగ్గట్టు ల్యాప్‌టాప్‌ సపోర్ట్‌ చేయాలి. ల్యాప్‌ టాప్‌ కొనేప్పుడు అసలు మనం ముఖ్యంగా ఇది ఎందుకు కొంటున్నామో..దానిమీద మాత్రమే ఫోకస్‌ చేస్తాం.. వర్క్‌ పర్పస్‌ అయితే అందులో బెస్ట్‌ తీసుకుంటాం..గేమింగ్‌ లవర్స్‌ అయితే..అందులో బెస్ట్‌ తీస్తారు.. మీరు ఒకవేళ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ కొనాలుకుంటుంటే..ఇప్పుడు వచ్చిన ఫ్రష్‌పీస్‌పై ఓ లుక్కేయండి. Alienware m15 R7 ల్యాప్‌టాప్‌ AMD ఎడిషన్ ఇండియన్‌ మార్కెట్లో విడుదలైంది. దీని ఫీచర్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా..!
Alienware m15 R7 gaming laptop review
Dell Alienware m15 R7 రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటిది RTX 3060 బేస్ వేరియంట్ 512GB- స్టోరేజ్ కలిగిన M.2 PCIe NVMe సాలిడ్ స్టేట్ డ్రైవ్‌. ఇక రెండోది 3070 Ti టాప్-స్పెక్ వేరియంట్ 1TB M.2 PCIe NVMe సాలిడ్ స్టేట్ డ్రైవ్‌తో వస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు 16GB DDR5 RAMని కలిగి ఉంటాయి. అలాగే Alienware కమాండ్ సెంటర్ ద్వారా అనుకూలీకరించదగిన RGB AlienFX ఇల్యూమినేటెడ్ కీబోర్డ్‌ను కలిగి ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం Dell.com, Dell ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, మల్టీ-బ్రాండ్ ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఇది గేమింగ్ ల్యాప్‌టాప్ కాబట్టి హీట్ నియంత్రణ కోసం ప్రత్యేకమైన క్రయో-టెక్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇంకా అడిషనల్‌గా Alienware m15 R7 అంతర్గత వాయుప్రసరణ 1.3x వరకు ఎక్కువ గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. శక్తి వినియోగాన్ని తగ్గించేటప్పుడు శీతలీకరణను పెంచుతుంది.

Alienware m15 R7 ల్యాప్‌టాప్‌ ధర..

RTX 3060 వేరియంట్ ధర రూ. 1,59,990 నుండి ప్రారంభమవుతుంది
RTX 3070 Ti వేరియంట్ ధర, రూ. 1,99,990 వరకు ఉంటుంది.

Alienware m15 R7 ల్యాప్‌టాప్‌లో మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ..

165 Hz రిఫ్రెష్ రేట్‌తో 15.6-అంగుళాల పూర్తి HD డిస్‌ప్లే అందించారు.
Nvidia 6GB GDDR6 లేదా 8GB GDDR6 గ్రాఫిక్స్ కార్డ్‌ను ఇచ్చారు.
16GB DDR5 RAM, 512GB/1TB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.
ఆక్టా-కోర్ AMD రైజెన్ 7 6800H ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
డాల్బీ అట్మాస్ టెక్నాలజీ, 2.5W స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి.
86Wh బ్యాటరీ, 240W అడాప్టర్‌ కూడా ఉంది.
Alienware m15 R7 (AMD) ల్యాప్‌టాప్‌లో ఇంకా Wi-Fi 6 , బ్లూటూత్ v5.2, రెండు USB 3.2 Gen 1 Type-A పోర్ట్‌లు, ఒక USB 3.2 Gen 1 Type-A ఉన్నాయి. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news