మీరూ ఇలా చేస్తుంటే స్మార్ట్ ఫోన్‌కి అడిక్ట్ అయినట్లే..!

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి బాగా అలవాటు అయ్యారు. ముఖ్యంగా సెల్ ఫోన్ ని బాగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూడకుండా ఉండలేక పోతున్నారు. 81 శాతం మంది వీడియో కాల్స్ కోసం ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 40 శాతం మంది వీడియో కాల్స్ కోసం వాడుతున్నారు. 33 శాతం మంది ఇంటర్నెట్ లో లేదా వారి స్మార్ట్ ఫోన్ లో గడిపిన సమయాన్ని తిరిగి చూసుకునేందుకు ప్రయత్నించినట్లు అధ్యయనం ద్వారా తెలుస్తోంది.

 

అయితే మితిమీరి సెల్ ఫోన్ వినియోగించటం చాలా తప్పు. స్మార్ట్ ఫోన్ వినియోగం వలన మీ పని తో పాటు మీ చుట్టూ ఉండే వారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. పక్కనున్న పళ్లు కూడా మిమ్మల్ని చూసి ఆకర్షణకు గురవుతారు. ఐతే ఇది ఏ మాత్రము ఆరోగ్యానికి మంచిది కాదు.

అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ మానసిక రుగ్మతల రికార్డు ప్రకారం ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని ఎక్కువగా వాడడం వల్ల వ్యసనం కాదని చెప్పారు. అయితే ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఎక్కువ సేపు స్క్రోల్ చేస్తూ ఉంటే వారు డూమ్ స్క్రోలింగ్ తో బాధపడుతున్నట్లు లెక్క.

దీని వల్ల చాలా మానసిక సమస్యలు వస్తాయి కాబట్టి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ముందు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వాటిని ఉపయోగించడం వల్ల పిల్లల్లో అంధత్వానికి గురయ్యే అవకాశం ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ సేపు వీడియోలు చూడడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.