ఎక్స్‌7 సిరీస్ ఫోన్ల‌ను లాంచ్ చేసిన రియ‌ల్‌మి.. ఫీచ‌ర్లు అదిరాయ్‌..!

-

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. ఎక్స్7 సిరీస్‌లో రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను గురువారం భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఎక్స్‌7 5జి, ఎక్స్‌7 ప్రొ 5జి పేరిట ఆ రెండు ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో అనేక అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

realme x7 5g x7 pro 5g smart phones launched in india

రియ‌ల్‌మి ఎక్స్‌7 5జి ఫీచ‌ర్లు…

* 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడ‌యాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌
* 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 64, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి
* 4310 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రియ్‌మి ఎక్స్7 ప్రొ 5జి ఫీచ‌ర్లు…

* 6.55 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ డైమెన్సిటీ 1000 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* 64, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్
* 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, అల్ట్రా ఫాస్ట్ ఫ్లాష్ చార్జింగ్

రియ‌ల్‌మి ఎక్స్‌7 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.21,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌, రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్స్‌ల‌లో ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ నుంచి ఈ ఫోన్ ల‌భిస్తుంది.

రియ‌ల్‌మి ఎక్స్‌7 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ రూ.29,999 ధ‌ర‌కు ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news