అదిరిపోయే ఫీచర్స్ తో టెస్లా కారు… వైరల్ అవుతున్న వీడియో..!

Join Our Community
follow manalokam on social media

టెస్లా కారు గురించి చాలానే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన, టెస్లా అధినేత ఎలోన్ మాస్క్ ఇప్పుడు మన దేశం లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా ఇండియాలో ఒక సబ్సిడరీ కంపెనీ కోసం రిజిస్టర్ చేసుకోవడం, ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అధికారికంగా బెంగళూరులో నమోదవ్వడం తెలిసినదే.

ఇది ఇలా ఉంటె టెస్లా కి సంబందించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆటో పైలెట్ ఫీచర్ తో నడుస్తున్న కారుని చూసి అవాక్ అవుతున్నారు. అందు లోని డ్రైవర్ ,ప్యాసింజర్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ని చూసిన నెటిజన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఆటో ఫైలైట్ ఫీచర్ విషయం లోకి వస్తే… టెస్లా తయారు చేసిన ఈ ఫీచర్ హైప్ తీసుకొచ్చింది. దీనిలో రోడ్ల పై కారు అదే సొంతంగా డ్రైవ్ చేసుకుంటుంది.

కారుని నడపడానికి డ్రైవర్ అవసరమే లేదు.. ఈ కారులో ఉండే సదుపాయాల గురించి చూస్తే.. టెస్లా ఆటో పైలెట్ ఫీచర్ తో పాటు అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టం, ట్రాఫిక్ సిగ్నల్ ను పాటించడం , లేన్ సెంటరింగ్, సెల్ఫ్ పార్కింగ్, ఆటోమేటిక్ లేన్ చేంజింగ్, సెమీ ఆటో నమస్ నావిగేషన్ వాహ్ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అలానే కారు బాధ్యత డ్రైవర్ తీసుకోవాలి. ఇది ఇలా ఉండగా టెస్లా సేల్స్ తో పాటు అసెంబ్లింగ్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ చేయనుంది. ఈ ఫీచర్స్ ఉన్న కారు మన దేశం లో ఎప్పుడు వస్తుందో చూడాల్సిందే.

TOP STORIES

ఖాతాదారులకు అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల అలర్ట్‌ చేసింది. ట్వీట్టర్‌...